తెలంగాణ

మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంధి నానాజీ

మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంధి నానాజీ

92వ బూత్ లో కార్యకర్తలతో కలిసి ప్రధాని ప్రసంగం విన్న బిజెపి జిల్లా ట్రెజరర్


పయ నించే సూర్యుడు సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ రేడియో ప్రసారం ఈరోజు సెప్టెంబర్ 27 ఆదివారం ఉదయం 11 గంటలకు DD ఛానల్ ద్వారా ప్రసారం కాగా కాట్రేనికోన మండలం 92వ బూత్ లో బిజెపి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ , సత్యనారాయణ నూకల సాయి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.మోదీ ప్రజలతో పంచుకున్న అంశాలను శ్రద్ధగా విన్నామని,ప్రధాని ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజల్లో దేశభక్తి,సామాజిక స్ఫూర్తి పెరుగుతోందని,ప్రతి నెలా మోదీ చెప్పే మాటలు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయన్నారు.బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని,భవిష్యత్తులో కూడా అందరూ కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS