తెలంగాణ

పేద దళితులని చిన్న చూపు చూస్తున్న మున్సిపల్ కమిషనర్

పేద దళితులని చిన్న చూపు చూస్తున్న మున్సిపల్ కమిషనర్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 28 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట పట్టణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసులని చిన్న చూపు చూస్తున్న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు పట్టణ కమిషనర్ గా కొనసాగే అధికారికి పట్టణంలోని సమస్యల మీద అవగాహనైనా ఉండాలి? లేదా ఎవరైనా వినతి పత్రం ఇచ్చి వారి సమస్యను తెలిపితే దానిపై స్పందించే తత్వమైన ఉండాలి? ఈ రెండు లేని అధికారిగా సూళ్లూరుపేట ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు ఒకటి వెలుగులోకి వచ్చింది నేడు మున్సిపల్ కమిషనర్ ని కలసి తమ బాధను విన్నవించుకు నేందుకు వెళ్లిన ఒక దళిత వాడకు చెందిన వ్యక్తులని ఆఫీసులో నిలబెట్టి ఆ సమస్య మీద విని విననట్టు చూసి చూడనట్టు వ్యవహరించిన తీరు చూస్తుంటే ప్రభుత్వంలో పని చేసే అధికారులకు ప్రజలు కట్టే పన్ను దార జీతం తీసుకుంటున్నామన్న సంగతి మరచిపోయి అధికారి.అధికార మదంతో వ్యవహరించారన్నది తెలిసి ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు ఒక అధికార హోదాలో ఉన్న వ్యక్తి సామాన్యుల దగ్గర వ్యవహరించాల్సిన తీరు చూస్తుంటే వీరు రాజ్యాంగం పట్ల గౌరవం లేని అధికారులు అనేది నిర్ధారణ అయిపోతున్నది ఇటువంటి వారి మీద కఠిన చర్యలు ప్రభుత్వ ఉన్న తాధికారులు తీసుకుంటారా లేదా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు ఖద్దరు దస్తులు ధరించి ఆఫీసుకు వచ్చే వారిని కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి సత్కరించే ఈ అధికారి సామాన్యులు తమ వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళితే అహంకార ధోరణితో నడుచుకోవడం ఎంతవరకు న్యాయం? దళిత వాడలో సమస్యలను వినతి పత్రం ద్వారా కమిషనర్కు అందజేయడం జరిగింది ఆ సమస్యను సానుకూలంగా స్పందించి ఆ సమస్యను క్లియర్ చేయాలనిసూళ్లూరు దళితులు చుట్టుపక్కల ప్రజలు కోరుకున్న కోరుకుంటున్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS