తెలంగాణ

బీజేవైఎం ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో నిరసన కార్యక్రమం.

బీజేవైఎం ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో నిరసన కార్యక్రమం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై, బీజేపీ నాయకులపై మరియు హిందూ దేవతలపై అవమానకరంగా మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భైంసా పట్టణంలోని చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ భైంసా బిజెపి టౌన్ శాఖ మరియు బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ మంత్రుల క్యాంప్ ఆఫీస్ మరియు గాంధీభవన్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని నినాదాలు చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS