రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను అవకతవకలు చేసి రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంపై రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రైతుల ఆవేదనను బాజిరెడ్డి గోవర్ధన్ కు విన్నవించారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, వినీత్ పటేల్, సుమన్, సిరిగిరి శేఖర్, పట్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.