తెలంగాణ

అశ్వాపురం మిషన్ భగీరథ సమస్యలపై ప్రజావాణిలో వినతి పత్రం

అశ్వాపురం మిషన్ భగీరథ సమస్యలపై ప్రజావాణిలో వినతి పత్రం

……....మిషన్ భగీరథ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి …. సర్పంచ్ బానోతు సదర్ లాల్

పయనించే సూర్యుడు, అక్టోబర్ 12, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు సంబంధించి నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణిలో సర్పంచ్ బానోతు సదర్ లాల్ ఎంపీడీఓ ముత్యాలరావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అశ్వాపురంలోని ఆర్ అండ్ బి కార్యాలయం నుంచి మేడ నరసింహారావు ఇంటి వరకు సుమారు మూడు వందల మీటర్ల మేర నూతన మిషన్ భగీరథ పైపులైన్ వేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమస్యను గతంలో పలుమార్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు, అదేవిధంగా మంచికంటినగర్‌లో నూతన పైపులైన్ వేసిన పదిహేను రోజులకే గేట్ వాల్వ్ వద్ద వాషర్ దెబ్బతినడంతో నీరు లీకై వృథాగా పోతున్నదని, ఇస్లావత్ నాగ చేను సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతిన్నదని వివరించారు. ఈ సమస్యలను కూడా పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ పనులు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు.ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాల్సిన బాధ్యతను దృష్టిలో ఉంచుకొని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, నీటి లీకేజీలను అరికట్టి దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచ్ బానోతు సదర్ లాల్ సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS