తెలంగాణ

దేశాయి బీడీ కంపెనీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి…

దేశాయి బీడీ కంపెనీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : బీడీ కార్మికుల వద్ద నుండి వెయ్యి బీడీలకు అక్రమంగా రూ. 11 తీసుకుంటున్న దేశాయ్ బీడీ కంపెనీ పై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు నన్నేసాబ్ డిమాండ్ చేశారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో దేశాయి బీడీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికురాలు నెలకు పదివేల బీడీలు చేయకపోతే నెల మొత్తం కాడాలు రాస్తామని బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెయ్యి బీడీలకు రూ. 11 తీసుకోవడం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. దేశాయి బీడీ యాజమాన్యం పద్ధతి మార్చుకోకపోతే బీడీ కార్మికులతో కలిసి కంపెనీ ముందు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని నన్నేసాబ్ హెచ్చరించారు. సమావేశంలో బీడీ కార్మికులు ఉన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS