ఘనముగా జరిగిన టిపి సిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

May 25, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 25 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినవి, కాంగ్రెస్ కార్యకర్తలు కేకు కట్ చేసి పండ్లు ప్రయాణికులకు పంపిణీ చేసి గ్రామములో డిజే పెట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించి తర్వాత అన్నదాన కార్యక్రమము నిర్వహించి మహేష్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ తరపున తెలపటం జరిగింది. మహేశన్నది స్వయముగా మన బాల్కొండ నియోజకవర్గం కాబట్టి మహేశన్న మరింత ఉన్నత శిఖరాల వరకు ఎదగాలని ఆయుఆరోగ్యాలతో సంతోషముగా యుంటూ రాజకీయంగా ఎదుగాలని గతములో యున్న సెంటిమెంట్ ప్రకారం నిజామాబాద్ జిల్లా వారు టీపీసీసీ అధ్యక్షులుగా ధర్మపురి శ్రీనివాస్ యున్నప్పుడే వరుసగా రాష్ట్రంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేషన్న, సిఎం రేవంతన్న ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని పూర్తి విశ్వాసం కార్యకర్తలలో యుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలోలో తప్పక కాంగ్రెస్ పార్టీ రెండోవ సారి అధికారంలోకి రావడం ఖాయమని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు రేవంతన్న ప్రజాపాలన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకావెళ్లి అవగాహన కల్పించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మండల కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గతములోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించినా సోమా దేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియామకమైన టమాటాల రవి ని మండల కాంగ్రెస్ పార్టీ తరపున సన్మానించటం జరిగింది. ఇట్టి కార్యక్రమములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ ఛైర్మెన్, కేఎంసీ డైరెక్టర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కిషన్ ఖేత్ నాయకులు,మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు అత్యధికంగా పాల్గొని విజయంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper