తెలంగాణ

రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదిన్నడో?..- ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రజలు…- నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్…

రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదిన్నడో?..- ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రజలు…- నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారు నుండి పంట పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేసి గత ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఇప్పటివరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని గత కొన్ని రోజుల క్రితం పలు పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో మెటల్ రోడ్డుకు సంబంధించిన మెటీరియల్స్ తీసుకువచ్చి “రోడ్డుపై వేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. ఈ రోడ్డు పై వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తుందని రైతులు, స్థానిక ప్రజలు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పై కాంట్రాక్టర్ ఎందుకింత నిర్లక్ష్యంగా వహిస్తున్నారని అర్థం కాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని రైతులు కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS