పయనించే సూర్యుడుD,23,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలోప్రజలను కార్యాలయాలచుట్టూ తిప్పించుకోవడం ఆపాలి!భీంగల్ పట్టణంలో ప్రభుత్వం నూతన డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేస్తున్న నేపథ్యంలో, వాటిని ఎక్కడ పొందాలనే విషయంపై ప్రజల్లో అయోమయం నెలకొంది.డిజిటల్ రేషన్ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలా? పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించాలా? లేక సంబంధిత రేషన్ డీలర్ వద్ద కార్డులు పొందాలా? లేదా జీపీఓ ని సంప్రదించాలా అనే విషయంపై ప్రజలకు సరైన సమాచారం అందకపోవడంతో అనేకమంది కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ పథకాల విషయంలో సరైన సమాచారం అందకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కావున భీంగల్ తహసీల్దార్ వెంటనే స్పందించి, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలి. డిజిటల్ రేషన్ కార్డులు ఎక్కడ పంపిణీ చేస్తున్నారు? కార్డులు పొందడానికి ఎవరిని సంప్రదించాలి?రేషన్ షాపుల వారీగా కార్డులు అందుబాటులో ఉన్నాయా? ఇంకా కార్డులు అందని లబ్ధిదారులు ఏ కార్యాలయంలో సంప్రదించాలి?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, ఎక్కడ కార్డులు పొందాలో ముందు గానే స్పష్టమైన ప్రకటన చేయాలి.భీంగల్ పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతున్నాం.ప్రజలకు పథకాలు అందించడమే కాదు… వాటిని ఎలా పొందాలో తెలియజేయడం కూడా అధికారుల బాధ్యతే!