తెలంగాణ

కూకట్పల్లి కాంగ్రెస్ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీకి 30 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల పయనం

కూకట్పల్లి కాంగ్రెస్ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీకి 30 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల పయనం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి “ఓటు బచావో – దేశ్ కు బచావో” కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు, దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న “ఓటు బచావో – దేశ్కు బచావో” కార్యక్రమంలో పాల్గొనేందుకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 30 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, జేఏసీ సభ్యులు ఢిల్లీకి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకుల ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS