తెలంగాణ

అంబంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ పర్యటన..

అంబంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ పర్యటన..

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్ పైన జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి గ్రామ ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో చర్చించారు. అలాగే వారం రోజుల క్రితం మరణించిన బీజేపీ కార్యకర్త మంత్రి లింగం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS