సినిమా వార్తలు

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్

దేవునిబండ తండా సర్పంచ్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం దేవునిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం సర్పంచ్ ఎం. శ్రీను నాయక్ అధ్యక్షతన, ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు దేవునిబండ తండా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యామ్‌లాల్, సర్పంచులు ఆర్. బాబు నాయక్, శివకుమార్, జంగయ్య, మాజీ సర్పంచులు కె. యాదయ్య, కె. బాలు, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, పుల్లారెడ్డి, దేవగిరి నవీన్, వార్డు సభ్యులు పి. జాను, పి. మారు, డి. ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాదావత్ విరేష్, కె. దశరథ్, డి. సుమన్, లక్ష్మణ్, జగన్, గ్రామ నాయకులు భాస్కర్ నాయక్, శంకర్ నాయక్, మూడవత్ చందు తదితరులతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS