తెలంగాణ

పేదల భూముల జోలికి వస్తే అటవీ అధికారుల ఆటలు సాగవు

పేదల భూముల జోలికి వస్తే అటవీ అధికారుల ఆటలు సాగవు

60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు నోటీసులు ఇవ్వడం సహించం!

పయనించే సూర్యుడుD,02,11,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలి.ఆర్మూర్:పేదలు, నిరుపేద రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల జోలికి వస్తే అటవీ అధికారుల ఆటలు సాగవని, 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతులకు నోటీసులు జారీ చేయడాన్ని సహించబోమని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర అధ్యక్షులు V. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి B. దేవారం హెచ్చరించారు.పేద రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలకు న్యాయం చేయాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం లేని వారికి ఇంటి స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ AIUKS ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ మందిరం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 800 మందితో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్‌ను కలిసి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన ఆందోళనలో ప్రజలను ఉద్దేశించి AIUKS రాష్ట్ర అధ్యక్షులు V. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి B. దేవారం మాట్లాడుతూ…గత 60 ఏళ్లుగా పేద రైతులు తమ కుటుంబాల జీవనాధారంగా భావించి సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. తరతరాలుగా సాగులో ఉన్న భూముల నుంచి పేద రైతులను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పేద రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధానాలను అధికారులు మానుకోవాలని, రైతుల సాగు హక్కులకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.22-A నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన రైతుల భూములను తొలగించి, దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని అన్నారు. సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలకు ముందుగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.పేదల భూములు, నివాస హక్కులు, జీవనాధారమైన వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు:60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు న్యాయం చేయాలి.సాగులో ఉన్న రైతులకు అటవీ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలి.22-A నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన రైతుల భూములను తొలగించాలి.దీర్ఘకాలంగా సాగులో ఉన్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలి.అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి.ఇళ్ల నిర్మాణానికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి ఈ కార్యక్రమంలో CPI(ML) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి R రమేష్, AIUKS ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు B కిషన్, ప్రధానకార్యదర్శి R దామోదర్, జిల్లా అధ్యక్షుడు S సురేష్, CPI(ML) మాస్ లైన్ మోర్తాడ్ మండల కార్యదర్శి G కిషన్, బీంగల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్, AIUKS జిల్లా ఉప అధ్యక్షుడు G నడిపినర్సయ్య, U రాజన్న, డివిజన్ కోశాధికారి ఇ రమేష్, నాయకులు C పోశన్న, T గంగాధర్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు M నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు సుమారు 800 మంది పాల్గొన్నారు.

    ఇ-పేపర్

    PAYANINCHE SURYUDU NEWS