తెలంగాణ

ఆవులకు, దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ…

ఆవులకు, దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్), సిద్దాపూర్ గ్రామాలలో మంగళవారం మూడు నెలల లోపు ఆవులకు, దూడలకు, ఉచిత నట్టల నివారణ మందులను పంపిణి చేశారు. ఈ శిబిరంలో 50 దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణి చేయడం జరిగిందని పశువైద్యాధికారి డా. సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో అంబం గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ సాయి ప్రసాద్,సిబ్బంది సాయిరాజ్, పాషా, అటెండ ర్ గంగారాం ఇంకా పశు పెంపకందారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS