తెలంగాణ

షాద్‌నగర్‌లో ఘనంగా ‘సేవాలాల్ సేన’ కార్యాలయం ప్రారంభం

షాద్‌నగర్‌లో ఘనంగా ‘సేవాలాల్ సేన’ కార్యాలయం ప్రారంభం

సమాజ సేవ, హక్కుల సాధనకు నిరంతరం కృషి:

సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాత్లావత్ రవి నాయక్

( పయనించే సూర్యుడు నవంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్‌నగర్ పట్టణంలో సేవాలాల్ సేన నూతన కార్యాలయాన్ని మంగళవారం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని రెడ్ రోజ్ మార్ట్ ఎదురుగా ఉన్న అయ్యప్ప కాలనీలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ… గిరిజన లంబాడీ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన, తండాల సమస్యల పరిష్కారం మరియు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో గిరిజనులను ముందంజలో నిలిపేందుకు సేన నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, తండాల్లో సేవాలాల్ సేనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సేవ్యా నాయక్, జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు సచిన్ నాయక్, షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి శివరాజ్ నాయక్, ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు నేనావత్ రాము నాయక్, మండల ఉపాధ్యక్షుడు శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సభావత్ మేగ్య నాయక్, గ్రామ అధ్యక్షుడు విజయ్ నాయక్, హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS