తెలంగాణ

మృతుడి కుటుంబానికి యువ నాయకుడు ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి యువ నాయకుడు ఆర్థిక సాయం

ఐదువేల ఆర్థిక సాయం అందించిన యువ నాయకుడు గోపి నాయక్

కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్

( పయనించే సూర్యుడు నవంబర్ 14 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఇటీవల మృతి చెందిన నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ ఒక యువ నాయకుడు తన ఉదారతను చాటుకున్నారు. ఫరూక్‌నగర్‌ మండలం కడియాలకుంట తండా పంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాకు చెందిన నాణ్య నాయక్‌ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఏడో వార్డు సభ్యుడు, యువ నాయకుడు మూడవత్‌ గోపి నాయక్‌ శుక్రవారం బూరుగడ్డ తండాకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని, తన వంతు సాయంగా రూ.5 వేల నగదును అందజేశారు.ఈ సందర్భంగా గోపి నాయక్‌ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి తన వంతు ఆర్థిక సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనకు ఉన్నదాంట్లో కొంతైనా ఇతరులకు సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించిన గోపి నాయక్‌ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కడియాలకుంట తండా సర్పంచ్‌ రాజు నాయక్‌ చౌహాన్‌, మాజీ సర్పంచ్‌ బుజ్జి రాజు నాయక్‌, తండా పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS