క్రీడా పోటీల్లో తమ ప్రతిభను చాటుకున్న చిన్నారులు
విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేసిన ఆదిలాబాద్ జోన్ ఏజీఎం కె. ప్రసాద్
విద్యతో పాటు క్రీడలతోనే సంపూర్ణ వికాసం సాధ్యమన్న వక్తలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్మల్ పట్టణంలోని నారాయణ హైస్కూల్ వేదికైంది. పాఠశాల ఆవరణలో ‘నారాయణ ప్రీమియర్ లీగ్’ పేరిట క్రీడా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ క్రీడోత్సవాల్లో విద్యార్థులు వివిధ క్రీడా విభాగాలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జోన్ ఏజీఎo కె. ప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు,జట్టుగా కలిసి పనిచేసే మనస్తత్వాన్ని (టీమ్ వర్క్) పెంపొందించడమే క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.హోరాహోరీగా సాగిన వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథి కె. ప్రసాద్ మరియు పాఠశాల యాజమాన్యం అభినందించారు.విజేతలకు మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలు (సర్టిఫికెట్లు) అందజేసి ప్రోత్సహించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి.రమేష్, ఏడీ రాజశేఖర్, ఏఓ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్స్ సంధ్యారాణి, శ్రుతి, జెడ్సీఓ నరేష్, కల్యాణి, వరలక్ష్మిలతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.