తెలంగాణ

కందికుప్పలో కౌంటింగ్ హాలును పరిశీలించిన తహసిల్దార్ రవి కిరణ్

కందికుప్పలో కౌంటింగ్ హాలును పరిశీలించిన తహసిల్దార్ రవి కిరణ్

ప యనించే సూర్యుడు సూర్యుడు నవంబర్ 14 ముమ్మిడి వరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేయబోతున్న కౌంటింగ్ హాలును తహసిల్దార్ రవి కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ రెవెన్యూ అధికారితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ హాలులో కావాల్సిన వసతులు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేసి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. లెక్కింపు రోజు అభ్యర్థుల ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. బ్యాలెట్ పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని అందరూ తప్పనిసరిగా పాటించాలని తహసిల్దార్ స్పష్టం చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS