తెలంగాణ

భీంగల్ మండల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అర్వింద్ భారీ నిధుల కేటాయింపు.

భీంగల్ మండల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అర్వింద్ భారీ నిధుల కేటాయింపు.

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. 28 అదనపు తరగతి గదులకు రూ.4.20 కోట్లు.. ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.17.70 లక్షలు భీంగల్ మండలానికి మొత్తం రూ.4.37 కోట్ల 70 వేల నిధులు మంజూరు ఎంపీ ధర్మపురి అర్వింద్, డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ మండల అధ్యక్షుడు అరే రవీందర్ భీంగల్:నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ భీంగల్ మండల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ భీంగల్ మండల శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 28 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.4 కోట్ల 20 లక్షలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులకు రూ.17 లక్షల 70 వేలు మంజూరు చేయడంతో భీంగల్ మండలానికి మొత్తం రూ.4 కోట్ల 37 లక్షల 70 వేల నిధులు సమకూరాయని బీజేపీ మండల అధ్యక్షుడు అరే రవీందర్ తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి రూ.4.20 కోట్లు వీబీ-జీ రామ్‌జీ పథకం కింద ఒక్కో అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.15 లక్షల చొప్పున మొత్తం 28 తరగతి గదుల నిర్మాణానికి రూ.4.20 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా పిప్రి గ్రామానికి 2, కుప్కాల్ గ్రామానికి 1, చెంగల్ గ్రామానికి 3, బడాభీంగల్ గ్రామానికి 4, దేవక్కపేట గ్రామానికి 2, జాగిర్యాల్ గ్రామానికి 3, ముచ్కూర్ గ్రామానికి 1, పాలికొండ గ్రామానికి 6, బెజ్జోర గ్రామానికి 3, మెండోర గ్రామానికి 3 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరతను అధిగమించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఈ కేటాయింపులు దోహదపడతాయని అరే రవీందర్ పేర్కొన్నారు.మౌలిక వసతుల కల్పనకు ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.17.70 లక్షలుఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.17.70 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో కుప్కాల్ గ్రామంలోని గిరిజన సంఘం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.4.95 లక్షలు, ముచ్కూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.4.95 లక్షలు కేటాయించారు.అదేవిధంగా పురానిపేట, చెంగల్ గ్రామాలకు ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు ఒక్కొక్క గ్రామానికి రూ.1.30 లక్షల చొప్పున, బాచన్‌పల్లి గ్రామానికి రూ.1.30 లక్షలు, కుప్కాల్ గ్రామానికి 2 LED లైట్లకు రూ.2.60 లక్షలు మంజూరు చేశారు.ఒకే మండలానికి రూ.4.37 కోట్లకు పైగా నిధులు విద్యా రంగ అభివృద్ధితో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒకే మండలానికి రూ.4 కోట్ల 37 లక్షల 70 వేల నిధులు మంజూరు కావడం భీంగల్ మండల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అరే రవీందర్ అన్నారు.ఈ సందర్భంగా భీంగల్ మండల అభివృద్ధికి నిధులు కేటాయించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ గారికి, నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కి భారతీయ జనతా పార్టీ భీంగల్ మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో భీంగల్ మండలంలోని గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్ ఉపాధ్యక్షుడు తక్కురి అంజయ్య కొట్టాల మోహన్ బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్ సుంకరి గంగాధర్ మల్లెల రమేష్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు రమావతి వెంకటేష్ రాజ్ కుమార్ భూత అధ్యక్షుడు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS