తెలంగాణ

ప్రతి నెల శ్రీవారి దర్శనం.. 75వ నెల దర్శన భాగ్యం

ప్రతి నెల శ్రీవారి దర్శనం.. 75వ నెల దర్శన భాగ్యం

పయనించే సూర్యుడు నవంబర్ 14 గ్రంధి నానాజీ అనంతపురంకు చెందిన అల్లగడ్డ రాము తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి నెల శ్రీవారిని దర్శించుకోవడం తన జీవితంలో గొప్ప భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఈ నెలతో తనకు 75వ నెల శ్రీవారి దర్శన భాగ్యం కలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనంతో మనసుకు ఎంతో ప్రశాంతత, ధైర్యం లభిస్తుందని తెలిపారు. గోవిందా గోవిందా అంటూ భక్తిభావంతో శ్రీవారిని దర్శించు కున్నానని చెప్పారు. ప్రతి నెల క్రమం తప్పకుండా అనంత పురం నుంచి తిరుమలకు రావడం తన సంకల్పమని పేర్కొన్నారు. శ్రీవారి కృపతోనే ఈ 75 నెలల దర్శన యాత్ర సాధ్యమైందని అన్నారు. భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. తిరుమలలో భక్తిభావంతో నిండిన వాతావరణం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. రాబోయే నెలల్లోనూ శ్రీవారి దర్శనం కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. శ్రీవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానని రాము అన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS