
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు భారతదేశ మొదటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,మేయర్ ఉమారాణి లతో కలిసి నెహ్రూ చిత్రపటానికి,విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి అని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీతో కలిసి పాల్గొని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆ పోరాటంలో 9 సంవత్సరాలు జైలు వెళ్లి జైలు జీవితం గడిపారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 20 గ్రామాలకు కరెంటు ఉండేది,రవాణా వ్యవస్థ గాని,మౌలిక సదుపాయాలు గాని,ఆర్థిక వ్యవస్థ గానీ చిన్నబిన్నంగా ఉండేవని, వీటిని నెహ్రూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారని, ఈ రోజు దేశంలో అన్ని గ్రామాలకు కరెంటు,రోడ్లు ఉన్నాయంటే అది నెహ్రూ తీసుకువచ్చిన సంస్కరణల వల్లనే అని, వ్యవసాయ రంగంలో విదేశాల నుండి విత్తనాలు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారని,విద్యారంగంలో iit వంటి వ్యవస్థను తీసుకువచ్చారని,నెహ్రూకి పిల్లలంటే ఎంతో మక్కువ కాబట్టి ఆయన జయంతి రోజును బాలల దినోత్సవంగా పురస్కరించుకున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి రాష్ట్రంలో ఇందిరమ్మ ఆరోగ్యభీమ పథకం ప్రారంభించడం జరుగుతుందని,దీని ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం అమలవుతుందని అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదు అని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు ఒక కోటి 18 లక్షల కుటుంబాలకు బీమా పథకం వర్తిస్తుందని, జిల్లాలో 4 లక్షల 51 వేల 188 కుటుంబాలకు బీమా వర్తిస్తుందని తెలిపారు. గతంలో రైతు కుటుంబాలకు మాత్రమే బీమా పథకం ఉండేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఆరోగ్య బీమా అందిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నెహ్రూ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతో కీలకపాత్ర పోషించారని అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో నెహ్రూ పాత్ర ఎన్నటికీ మరువలేనిదని ఆయన అన్నారు. నెహ్రూ లండన్ లో చదువుకొని భారతదేశానికి అలాంటి విద్య అందాలను ఆలోచనతో ఐఐటి ఇస్రో గొప్ప విద్యాలయాలు ప్రారంభించిన మహోన్నత వ్యక్తి అని ,అదేవిధంగా అధునాతన దేవాలయాలు అని చెప్పుకొనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గానీ,, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వాని ఆయన ముందు చూపుతో నిర్మించడం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ఇంగ్లాండ్ అమెరికా వంటి దేశాలు ఇబ్బందులు పడుతుంటే, భారతదేశం మాత్రం నెహ్రూ ముందు చూపుతో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా తట్టుకునే గొప్ప శక్తిగా నిలబడుతుంది అని ,నెహ్రూ సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. ఈరోజు బీజేపీ నాయకులు నెహ్రూ చేసిన సేవలను మరచిపోయి ఆయనపై విమర్శలు చేస్తున్నారని ,బిజెపి నాయకులు మాట్లాడుతున్న మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనిస్తున్నారని మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనలతో దేశంలో ఇందిరమ్మ ఆరోగ్య భీమా పథకం ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది అని దీని ద్వారా రాష్ట్రంలోని రేషన్ కార్డును అన్ని కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య భీమా అందించడం జరుగుతుంది అని ప్రతి కుటుంబానికి అండగా నిలబడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందుకే ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు కావున ఈ నెల 19 నుండి 30 తేదీ వరకు ప్రతి ఒక్కరు ఈ పథకంలో రెండు రోజులు చేసుకోవాలని అధికారులతో వచ్చినప్పుడు పూర్తి వివరాలు ఇచ్చి పెళ్లి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఎఐసిసి కో ఆర్డినేటర్ గన్ రాజ్,జిల్లా కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్ గౌడ్, తర చాంద్,జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా St అధ్యక్షులు యాదగిరి,జిల్లా సేవాదళ్ అధ్యక్షు డు బెన్సన్ రాజు,సీనియర్ నాయకులు రత్నాకర్,కార్పొరేటర్ లు ప్రవీణ్ గౌడ్,నరేందర్, అర్బన్ SIR కో ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్,మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,జెండా balaji చైర్మన్ లవంగ ప్రమోద్, పోల ఉష, విజయలక్ష్మి, అపర్ణ,నరేందర్ గౌడ్,బంటు బలరాం, కుద్దుస్, రఘు,మల్యాల గోవర్దన్, సాయి కుమార్,గణేష్,ప్రవీణ్,అఫ్సర్, మిన్హాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు