ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ చిన్నారుల అన్నప్రాసన వేడుకకు హాజరైన అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్

అంగన్వాడీ చిన్నారుల అన్నప్రాసన వేడుకకు హాజరైన అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్

సమస్యను గుర్తించి అంగన్వాడీ కేంద్రానికి వెంటనే ఫ్యాన్ వితరణ పయనించే సూర్యుడు, నవంబర్ 18, అశ్వాపురం: అశ్వాపురం లోని ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు చిన్నారులకు అన్నప్రాసన వేడుక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు స్వయంగా అన్నప్రాసన చేయించి ఆశీర్వదించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా పరిశీలించిన సర్పంచ్, అక్కడి సౌకర్యాలు, చిన్నారులకు అందుతున్న సేవల గురించి అంగన్వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని టీచర్ తెలియజేయగా, వెంటనే స్పందించిన సర్పంచ్ కొత్త ఫ్యాన్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, నేటి చిన్నారులే రేపటి భావి పౌరులని, వారి ఆరోగ్యం, విద్య, ఎదుగుదల పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, చిన్నారుల సంక్షేమం కోసం గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాకుబ్, వార్డ్ సభ్యులు రాగం సరిత అంగన్వాడీ టీచర్, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS