ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

పయనించే సూర్యుడుD. 17.11.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. వెన్నెముక చికిత్స కోసం మహమ్మద్ ఖాజాకు రూ.2 లక్షల LOC మంజూరు బల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా వెన్నెముక సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించారు. ఈ మేరకు ఈ రోజు మంగళవారం రోజున హైదరాబాద్‌లోని తన నివాసంలో మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులకు LOC మంజూరు పత్రం కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమలాంటి పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల LOC మంజూరు చేయించి అండగా నిలిచిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS