ఆంధ్రప్రదేశ్

కాశిరెడ్డిగూడ మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ..స్వయం ఉపాధికి బాటలు

కాశిరెడ్డిగూడ మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ..స్వయం ఉపాధికి బాటలు

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ, ప్రథమ్ సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్న సుమారు 30 మంది గ్రామ మహిళలు ( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్మం మండలం కాశిరెడ్డిగూడ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో కాశిరెడ్డిగూడలో బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రగతి వెల్ఫేర్ సొసైటీ, ప్రథమ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళలు ఎంతో ఆసక్తిగా ముందుకొచ్చి శిక్షణలో చేరారు.
బ్యూటీషియన్ రంగంలో మెలకువలు, నైపుణ్యాలు నేర్పి భవిష్యత్తులో సొంతంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. శిక్షణకు హాజరైన ట్రైనర్లు లత, నాగమణి కోర్సు వివరాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాధిక, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజర్ డ్యాగ శంకర్, వార్డు సభ్యులు మల్లేష్ గౌడ్, లావణ్య, శ్రీకాంత్, కోఆర్డినేటర్లు శ్రీనాథ్, మాధురి, నేహా పాల్గొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని వారు సూచించారు. తమ అభివృద్ధి కోసం ఇలాంటి శిక్షణ కల్పిస్తున్న నిర్వాహకులపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS