పయనించే సూర్యుడు నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం చెయ్యేరు గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో చెయ్యేరు అగ్రహారంకు చెందిన అప్పన భీమలింగం కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, దంపతులచే కే టీవీ చిన్నబ్బాయి ఆధ్వర్యంలో రుత్వికుల చే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారికి ఘనంగా లక్షబిల్వదళపూజ నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, మహాన్యాసం, ఏకాదశ విశేషద్రవ్యాలతో ఏకాదశ వార రుద్రాభిషేకాలు, సూర్యనమస్కారాలు, లక్ష బిల్వార్చన, లలితా సహస్రనామ కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన, నీరాజనం, మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి, మహాశీర్వచనం నిర్వహించారు. పండిత సత్కారాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం క్షీర ద్వాదశి రోజున ఈ పూజ నిర్వహించగా, అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన మహిళలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్రంధి నాని బాబు, భక్తులు, గ్రామ ప్రజలతో పాటు వేదపండితులు పాల్గొన్నారు.