ఆంధ్రప్రదేశ్

కుండలేశ్వర స్వామిని దర్శించిన చాగంటి కోటేశ్వరరావు

కుండలేశ్వర స్వామిని దర్శించిన చాగంటి కోటేశ్వరరావు

కార్తీక మాసంలో కుండలేశ్వరంలో భక్తి వాతావరణం, ప్రవచనంతో భక్తులకు ఆధ్యాత్మిక సందేశం పయనించే సూర్యుడు నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికొన: ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం గ్రామంలో కొలువైన శ్రీ కుండలేశ్వర స్వామివారిని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. రేవు దగ్గర నుంచి ఆలయం వరకు ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, ప్రముఖులు, భజంత్రీలు మేళతాళాలతో, పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ పండితులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కుండలేశ్వర స్వామివారి విశిష్టత, క్షేత్ర మహత్యంపై భక్తులకు తన ప్రవచనం ద్వారా వివరించారు. చాగంటి రాకతో కుండలేశ్వరం గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ అభివృద్ధి, క్షేత్ర ప్రాముఖ్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. కార్తీక మాసంలో శివార్చన, దీపారాధన, అన్నదానం వంటి పుణ్యకార్యాల విశిష్టతను వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. చాగంటిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS