ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలను విస్మరిస్తున్న మోడీ

ప్రజా సమస్యలను విస్మరిస్తున్న మోడీ

హామీల అమలులో రేవంత్ రెడ్డి మొండి చేయి. పయనించే సూర్యుడుD.24.11.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. డిసెంబర్ 29న ప్రజా గర్జన-ఛలో హైదరాబాద్ ను విజవంతం చేయండి.* CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు P రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి B దేవారం ప్రధాని మోడీ ప్రజాసమస్యలను విస్మరిస్తు ప్రజలను వంచిస్తున్నాడని, హామీల అమలులో రేవంత్ రెడ్డి మొండి చేయి ఇచ్చాడని అందుకే CPI(ML) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిసెంబర్ 29న ప్రజా గర్జన-ఛలో హైదరాబాద్ పిలుపును ఇచ్చిందని పిలుపును విజవంతం చేయాలని . CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు P రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి B దేవారం ల పిలుపును ఇచ్చారు. మంగళవారం నాడు కుమార్ నారాయణ భవాన్ ఆర్మూర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతు: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాగ్దానాలను అమలు చేసి, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 29న హైదరాబాదులో జరుగుతున్న ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పాలన! మాటలకు అంతులేదు!! చేతలకు పొంతన లేదు!!! అని అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. ఎన్నికల సమయంలో 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారెంటీ ల కార్డు లు ఇచ్చారు. మహిళలకు నెలకు 2500/- పథకం మాటలలోనే మిగిలింది. కల్యాణ లక్ష్మికి, తులం బంగారం పథకం, ఆటో కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000/- రూపాయల పథకం ఊసే లేదు. రైతాంగ రుణాల రద్దు, రైతు భరోసా అరా కొరా చేసి చేతులు దులుపుకున్నారు. మరోవైపు వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, చేతివృత్తుల వారికి ఇచ్చే సౌకర్యాలు ఏమీ లేవు. మూడేళ్లు అయినా వాటి ఊసే ఎత్తడం లేదు. ఇందిరమ్మ గృహాల కేటాయింపు అరాకొరే. పేద వాళ్ళందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వం అర్హుల జాబితాను దళారీలకు అప్పగించింది. పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలి. రష్ట్రంలో పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వలేదు. సీజన్ ఆరంభం కాగానే ఫారెస్ట్ వారి దౌర్జన్యం యధావిధిగా సాగుతున్నది. పోడు రైతులు పట్టాలు లేక తగిన పథకాలు, సౌకర్యాలు పొందలేకపోతున్నారు. అలాగే అసైన్డ్ భూములను ప్రభుత్వం చాలా చోట్ల లాగేసుకుంటున్నది. వారికి పట్టాలు గ్యారెంటీలు ఇవ్వాలి. కేంద్రంలో మోడీ, అమిత్ షా ల నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజల, దేశ మౌలిక సమస్యలను గాలికి వదిలి మత ఉన్మాదం లేపుతూ, మూఢత్వాన్ని పెంచుతూ, ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ, పాసిస్ట్ పోకడలు అనుసరిస్తున్నది. దేశ కీలక వనరులను ఆదాని, అంబానీ లాంటి దేశ బడా కార్పొరేట్ శక్తులకు, అలానే విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నది. రాజ్యాంగాన్ని, దాని మౌలిక లక్ష్యాలను కాలరాస్తూ, సిబిఐ, ఐటీ, ఈడి, ఎన్నికల కమిషన్, తదితర దర్యాప్తు, రక్షణ వ్యవస్థలను, చివరకు న్యాయవ్యవస్థను కూడా తమ జేబు సంస్థలుగాను మార్చుకుని, మాట్లాడే వాడే లేకుండా చేస్తున్నారు. ప్రశ్నిస్తే? దేశద్రోహి, పాకిస్తానీ, ఉగ్రవాది, అర్బన్ నక్సల్, దిమాగి నక్సలైట్ అంటూ నిందలేస్తూ, కేసులు మోపుతూ, అరెస్టు చేస్తూ, అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారు.
అలాగే జీఎస్టీ పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మోడీ చోరీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడాలి. ప్రజలు ప్రజాస్వామిక స్ఫూర్తితో హక్కులను కాపాడుకోవాలి. కార్మిక,కోడ్ లను, రైతు వ్యతిరేక చట్టాలను, మత వక్రీకరణలను, నిర్బంధ ఉపా లాంటి చట్టాల రద్దు కోసం పోరాడాలి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాలు అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 29న చలో హైదరాబాదు కార్యక్రమాన్ని ప్రజాగర్జనను నిర్వహిస్తున్నది. అందుకు సబండ వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, చేతివృత్తుల వారు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు R రమేష్, S సురేష్, జీ కిషన్, V సత్తేవ్వ , K రాజేశ్వర్, ఎం ముత్తేన్న ,డివిజన్ R దామోదర్, B కిషన్, M నరేందర్, G అరవింద్, D దుర్గప్రసాద్, MD నసిర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS