ఆంధ్రప్రదేశ్

నడవపల్లిలో దూసుకుపోతున్న కత్తెర గుర్తు ప్రచారం – బుచ్చివెంకయ్యమ్మకే మా ఓటు అంటున్న గ్రామస్తులు

నడవపల్లిలో దూసుకుపోతున్న కత్తెర గుర్తు ప్రచారం – బుచ్చివెంకయ్యమ్మకే మా ఓటు అంటున్న గ్రామస్తులు

పయ నుంచి సూర్యుడు నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలంలోని నడవపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన దంతులూరి బుచ్చివెంకయ్యమ్మను గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలన్నారు. అనంతరం ఇంటింటికీ ప్రచారానికి వెళ్లారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం దూసుకుపోతుందని, కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కొన్నేళ్లుగా అభివృద్ధి లేక రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతామని బుచ్చివెంకయ్యమ్మ అన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS