పయనించే సూర్యుడు నవంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నగర పంచాయతీ నూతన చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గుబ్బల గంగా రత్న భవానికి, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక అయిన ములపర్తి దుర్గా మహేశ్వరికి మరియు ఇతర వార్డు కౌన్సిలర్లకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాట్ల పృథ్వీరాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ముమ్మిడివరం నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు కట్టా సత్తిబాబు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముమ్మిడివరం నగర పంచాయతీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డులోని ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో ముమ్మిడివరం నగర పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నూతన పాలకవర్గానికి సూచించారు. నూతన చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు అందరూ సమన్వయంతో పనిచేసి ముమ్మిడివరం నగర పంచాయతీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.