తెలంగాణ

భైంసా పట్టణంలోని గోశాలను శ్రీక్షేత్ర దత్తధామ్‌ (గోవర్ధన్‌) నాసిక్‌కు చెందిన పూజ్య దత్తదాస్‌జీ మహారాజ్‌,మద్నాపూర్ గంగేశ్వర్ మహారాజ్ తో కలిసి సందర్శించారు.

భైంసా పట్టణంలోని గోశాలను శ్రీక్షేత్ర దత్తధామ్‌ (గోవర్ధన్‌) నాసిక్‌కు చెందిన పూజ్య దత్తదాస్‌జీ మహారాజ్‌,మద్నాపూర్ గంగేశ్వర్ మహారాజ్ తో కలిసి సందర్శించారు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలో ని గోశాలలో గంగేశ్వర్ మహారాజ్ పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గోశాల పరిస్థితిని అలాగే గోశాల భూమిని దత్తదాస్‌జీ మహారాజ్‌ పరిశీలించారు.గోమాతల సంరక్షణ,గోశాలల అభివృద్ధిపై నిర్వాహకులతో చర్చించారు.గోమాత, గంగా, గాయత్రి పేరుతో చేపడుతున్న గో గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా 9 లక్షల గోమాతల సంరక్షణ కోసం దేశ వ్యాప్తంగా భారీ గోశాలల నిర్మాణం చేపట్టాలని సంకల్పించినట్లు దత్తధామ్‌ నిర్వాహకులు తెలిపారు.పూజ్య దత్తదాస్‌జీ మహారాజ్‌ గత 25 ఏళ్లుగా మౌనంగా, ఆహారం తీసుకోకుండా సాధనలో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు.గోశాలలను ఆదుకుందాం.. గోసంతతిని సంరక్షిద్దాం.. గోమాత సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS