చిలకమర్రి గ్రామానికి మీరు చేసిన సేవలు వెలకట్టలేని విబిఆరెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కంటే శ్రీశైలం

May 30, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు మే 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)మా గ్రామానికి మీరు చేసిన సేవలు వెలకట్టలేనివని, మీరు ఎక్కడికి వెళ్లిన మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని బిఆరెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కంటే శ్రీశైలం అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి బదిలీ సందర్బంగా ఆమెను శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కంటే శ్రీశైలం మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా మా ఊరి గ్రామ పంచాయతీలో సేవలందిస్తూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు.రెండు సంవత్సరాలు సర్పంచులు లేకపోయినా మా గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచారని అన్నారు.మా గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపి ఉత్తమ గ్రామ పంచాయతీ ఆవార్డు రావడంలో మీ పాత్ర ఎంతో కీలకమని అభినందించారు.మీరు ఎక్కడికి వెళ్లి ఆ గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసి మంచి పేరుప్రఖ్యతలు సాధించాలని వివరించారు. మీరు చేసిన అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ,నర్సింహా రెడ్డి, జర్నలిస్ట్ నరేష్,బిఆరెస్ నాయకులు శ్రీనివాస్,వార్డు సభ్యులు చంద్ర శేఖర్,రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడివయ్య, బ్యాగరి భీమయ్య, సూరారం శ్రీశైలం, గంగపురం నర్సింహా, బ్యాగరి బాల్ రాజు, మల్లేష్, శ్రీను, అంజి, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper