భీంగల్ మండలం కుప్పల్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కనుగోలు చేసిన స్టీల్ ప్లేట్లు పంపిణీ

May 30, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 30 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం ఈరోజు శనివారం రోజున భీమ్గల్ ఎంపీడీవో సంతోష్ కుమార్ కుప్కల్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన స్టీల్ ప్లేట్లను పంపిణీ చేసినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్కల్ గ్రామము ప్లాస్టిక్ రహిత గ్రామముగా తయారు చేయుటకు ముందడుగులో భాగంగా పండుగలు మరియు ఫంక్షన్లలో ప్లాస్టిక్ విస్తార్లను నిషేధించి స్టీల్ ప్లేట్లను వినియోగించే విధంగా గ్రామ పంచాయతీ చొరవ తీసుకున్నందుకు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ నర్సింగ్ రావు మరియు పాలకవర్గం పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper