సినిమా చిత్రికరణకు ముహూర్తపు క్లాప్
ప య నించే సూర్యుడు జూన్ 1( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) శ్రీ లక్ష్మీనరసింహ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్కే 1000 వాలా వర్కింగ్ టైటిల్పేరుతో సినిమా చిత్రికరణ కు నూతన డైరెక్టర్ బలసాడి విజయ ప్రసాద్ తల్లి బలసాడి లక్ష్మి చేతుల మీదుగా ఆదివారం ముహూర్తపు క్లాప్ కొట్టారు. కాట్రేనికోన మండల పరిధిలోని పల్లం రామాలయం నందు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేసి 8.14 గంటలకు ముహూర్తపు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా పరిచయం అవుతున్న డైరెక్టర్ బలసాడి విజయ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా నూతన నటీనటుల పరిచయంతో తీస్తున్నామన్నారు. జూన్ 21 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని , ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నారు . సుమారు 40 రోజులలో షూటింగ్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ సినిమా నిర్మాణానికి నిర్మాత అంటూ ఎవరు లేరని, పదిమంది స్నేహితుల సహకారంతో ఈ సినిమా నిర్మాణం చేయడం జరుగుతుందని ప్రసాద్ తెలిపారు. తాను గతంలో పలు చిత్రాలకు రైటర్, అసోసియేట్ డైరెక్ట్ గా పనిచేయడం జరిగిందని తెలియజేశారు. అమ్మాయిలకు సంబంధించి మంచి కుటుంబ కదా చిత్రంతో సినిమా తీస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దండుప్రోలు సత్యం, బాలయోగి, గ్రామ పెద్దలు ప్రజలు, బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.