కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి*కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది.
పయనించే సూర్యుడు :4 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్.. ఏర్గట్ల కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శివకుమార్బాల్కొండ నియవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుందని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు.గురు వారం రోజున తొర్తి బట్టపూర్ గ్రామలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసరు .ఏర్గట్ల మండల మాజీ మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి.మండల కాంగ్రెస్ కార్యవర్గం మరియు గ్రామ కార్యవర్గం ఎంపిక గురించి గ్రామ కార్యకర్తలు అందరి సమక్షం లో చర్చించారు. ఈ సందర్బంగా శివాన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత మనందరిది అని,పార్టీ ఆదేశానుసరం పార్టీ కోసం అందరూ పని చేయాలని, పార్టీకోసం కష్టపడ్డా ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది అనీ తెలిపారు ఇట్టి కార్యక్రమం లో మాజీ డి సి సి డిలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కౌడ పెద్ద బూమేష్ , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దానం గంగా మోహన్, తొర్తి ఉప సర్పంచ్ సుమన్ గౌడ్ , నాయకులు రషీద్ తొర్తి కార్యకర్తలు పాల్గొన్నారు.