సీఎం జడ్చర్ల బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
పాల్గొన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)నేడు తెలంగాణ ముఖమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఉదండాపూర్ రిజర్వాయర్ పర్యటన అనంతరం జడ్చర్లలో కల్వకుర్తి రోడ్డులో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.అంతకుముందు జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి రేపటి సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.