అగ్ని వీర్ లో ఉద్యోగం సాధించిన యువకులకు ఘనంగా సన్మానించిన ముధోల్ మాజీ శాసన సభ్యులు శ్రీజి విట్టల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి దేశ సేవలలో యువకులది కీలక పాత్ర భైంసా పట్టణ కేంద్రానికి చెందిన ఐదుగురు యువకులు ఆకాష్, కార్తీక్, వంశీ, మణికంఠ, రోహన్, వీరు అగ్ని వీర్ లో ఉద్యోగం సంపాదించి దేశ రక్షణ సేవలో చేరడం జరిగింది. వీరికి మాజీ ఎమ్మెల్యే గారు శాలవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరికి బైంసా పట్టణ కేంద్రానికి చెందిన ఐక్యత సేవా సమితి అధ్యక్షుడు యోగేష్ వారికి దగ్గర ఉండి ట్రైనింగు ఇచ్చి ఉద్యోగం పొందడంలో ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి కూడా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి డైరెక్టర్ తోటరాము,సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కిష్టన్నా,ఓలా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, దేగాం గ్రామ వార్డు సభ్యులు, వీడిసి అధ్యక్షులు నాని మరియు తదితరులు ఉన్నారు.