పయనించే సూర్యుడు న్యూస్, సెప్టెంబర్ 24తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డిఆల్విన్ కాలనీ ఆదిత్య నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గురువారం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, గౌరవ సలహాదారు చింతపంటి భూమయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తులతో కలిసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తి భావంతో అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదంతో పాటు అన్న సమారాధనను స్వీకరించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.