భారత క్రికెట్ షాక్: చిన్న జట్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోతున్న భారత్
పయనించే సూర్యుడు న్యూస్ :Hong Kong Sixes 2025 టోర్నీలో భారత్‌కి దారుణ పరాజయాలు.. నేపాల్ చేతుల్లో 92 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు..ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది భారత్. టీ20 వరల్డ్ కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, మహిళల అండర్19 వరల్డ్ కప్, మహిళల వన్డే వరల్డ్ కప్ టైటిల్స్‌ని గెలిచిన భారత జట్టు, ఆస్ట్రేలియా టూర్లో టీ20 సిరీస్‌లోనూ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే హంగ్ కాంగ్ సిక్సెస 2025 టోర్నీలో మాత్రం భారత జట్టు, అనామక జట్లతో చిత్తు చిత్తుగా ఓడుతోంది.. హంగ్ కాంగ్ సిక్సర్స్ 2025 టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 2 పరుగుల తేడాతో విజయం అందుకుంది భారత జట్టు. అయితే ఆ తర్వాత కువైట్ చేతుల్లో 27 పరుగుల తేడాతో ఓడిన భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా నేపాల్‌తో మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని అందుకుంది.. హంగ్ కాంగ్ సిక్సర్స్‌తో మ్యాచ్‌లు 6 ఓవర్లే జరుగుతాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు, నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 137 పరుగులు చేసింది. నేపాల్ కెప్టెన్ సందీప్ జోరా 12 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. లోకేశ్ బామ్ 7 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు..ఈ లక్ష్యఛేదనలో 3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45 పరుగులు చేసి, 6 వికెట్లు కోల్పోయింది. హంగ్ కాంగ్ సిక్సర్స్‌లో ఆరుగురు బ్యాటర్లే బ్యాటింగ్ చేయాలి. 6 ఓవర్లే బ్యాటింగ్ చేయాలి. అలాగని భారత్ తరుపున అల్లాటప్పా అనామక ప్లేయర్లు ఆడలేదు. రాబిన్ ఊతప్ప, ప్రియాంక పంచల్, స్టువర్ట్ భిన్నీ, దినేశ్ కార్తీక్ వంటి ఇలా భారత జట్టుకి ఆడిన ప్లేయర్లు ఆడారు.. అయితే ఈ ఫార్మాట్‌ని అలవర్చుకోవడానికి భారత ప్లేయర్లు తెగ ఇబ్బంది పడుతుండడంతో హంగ్ కాంగ్ సిక్సర్స్ టోర్నీలో అనామక జట్లు, భారత్‌పై ఘన విజయాలు అందుకుంటున్నాయి..