PS Telugu News
Epaper

ఫిట్‌నెస్ లక్ష్యం సాధించిన శర్వానంద్ – క్రమశిక్షణ, కష్టానికి ఫలితం

📅 08 Nov 2025 ⏱️ 4:16 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :వైవిధ్య‌మైన సినిమాల‌తో టాలీవుడ్‌లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్ ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న ఛాలెంజ్ గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత, ఎనిమిది నెలల పాటు నరకం చూశానని, ఆ సమయంలో జీవితం అంటే ఏంటో కొత్తగా గ్రహించానని అన్నాడు శ‌ర్వానంద్‌. మాస్ ఇమేజ్‌ కోసం కాకుండా కంటెంట్‌ ఆధారిత సినిమాలను ఎంచుకునే హీరోగా గుర్తింపు పొందిన శ‌ర్వా..‘ప్రస్థానం’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌ర్వాత ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’, ‘సంక్రాంతి’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హీరోగా రన్ రాజా ర‌న్‌ ‘శతమానంభవతి’ చిత్రాల‌తో బిగ్ బ్రేక్ సాధించి అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. త‌ర్వాత వచ్చిన ‘పడిపడిలేచె మనసు’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ చిత్రాలు పెద్దగా విజయాన్ని సాధించకపోయినా, శర్వా మాత్రం వెనుకడుగు వేయలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో శర్వానంద్ తన ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి వివరించాడు. “యాక్సిడెంట్ తర్వాత కొన్ని నెలలు యాంటీబయోటిక్స్‌ పైనే ఉన్నాను. ఆకలి చాలా వేస్తుండేది… తింటూ బాగా బరువు పెరిగాను. కానీ ‘బైకర్’ రోల్‌ కోసం ఫిట్‌గా ఉండాలి. అందుకే కఠినమైన డైట్ ఫాలో అయ్యాను” అని చెప్పాడు. “ఉదయం 4.30 గంటలకు కెబీఆర్ పార్క్‌లో పరుగులు మొదలుపెట్టాను. గంటలకొద్దీ జిమ్‌లో కసరత్తులు చేసేవాడిని. భోజనం విషయంలో చాలా కఠినంగా ఉండేవాడిని. ఎంత కష్టం అయినా ఆ డైట్‌ను మిస్ కాలేదు. అలా 22 కిలోల బరువు తగ్గగలిగాను,” అని శర్వా వివరించాడు. తన కృషి ఫలంగా ఇప్పుడు మరోసారి ఎనర్జీతో నిండిపోయానని, ‘బైకర్’లో పూర్తిగా కొత్త శర్వాను ప్రేక్షకులు చూడబోతారని చెప్పాడు.‘బైకర్’ చిత్రాన్ని కంకర అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. డిసెంబ‌ర్ 6న మూవీ రిలీజ్ కానుంది.

Scroll to Top