చిక్కడపల్లి గ్రామ కమిటీకి శీతల శవపేటిక అందజేత…
రుద్రూర్, నవంబర్ 8 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సీనియర్ సభ్యులు, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే సహకారంతో రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామ కమిటీకి శనివారం శీతల శవపేటికను అందించారు. చనిపోయిన మృతదేహం చెడిపోకుండా ఉండడానికి వాడే శీతల శివపేటిక (డెడ్ బాడీ డీ ఫ్రీజర్) ను అందజేశారు. ఈ సందర్బంగా విలేజ్ కమిటీ పెద్దలు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చనిపోయిన వారి కొరకు అందరూ వాడుతున్నారని ఇంతటి మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా కమిటీకి శీతల శవపేటిక అందజేసిన లయన్ శ్యాంసుందర్ పహాడె కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, సభ్యులు లయన్ మఛ్కూరి రమేష్, లయన్ డాక్టర్ మల్లేష్, లయన్ పార్వతీ ప్రశాంత్, గ్రామ పెద్దలు విడిసి అధ్యక్షులు కూర్మారాజు, ముదిరాజ్ సంగం సభ్యులు కరోల రాజయ్య, మచ్కురి అశోక్, మక్కయ్య, తగిలేపల్లి అశోక్, పెద్ద హనుమంతు, వేముల రమేష్, మోహన్, గంగారాం, జల్లా సాయిలు తదితరులు పాల్గొన్నారు.