PS Telugu News
Epaper

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు..

📅 08 Nov 2025 ⏱️ 4:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కేకు కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్సీ సెల్అధ్యక్షులు బండారు లాలు”

(పయనించే సూర్యుడు నవంబర్ 8 రాజేష్)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి 57 వ జన్మదిన వేడుకలను దౌల్తాబాద్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి గారు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు ఘనంగా నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చెయ్యడం జరిగింది ఈ సందర్భంగా మద్దెల స్వామి గారు, బండారు లాలు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి గారికి మరింత శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈట్టి కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు,మల్లారెడ్డి,కర్నల శ్రీనివాస్ రావు, మాజీ సర్పంచులు భద్రయ్య, ఆది వేణుగోపాల్, ఎల్లయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, లలిత, కృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకులు బాలశేఖర్ రెడ్డి, వినోద్, కాంగ్రెస్ నాయకులు స్వామి,రమేష్, రైతన్న నందం,లింగం, శ్రీను,సంపత్ రెడ్డి బండి కృష్ణ, సాయిలు,తదితరులు పాల్గొన్నారు….

Scroll to Top