PS Telugu News
Epaper

నడి రోడ్డుపై బ్రిడ్జికి రంధ్రం వాహనాలు రాకపోకలు అంతరాయం

📅 08 Nov 2025 ⏱️ 8:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు అప్పారావు పాలెం మార్గమధ్యంలో ఉన్న ఓ పాత బ్రిడ్జి కి పెద్ద రంధ్రం ఏర్పడింది. కొంత భాగం కూలిపోయి భారీ రంద్రం పడగా మిగిలిన కొద్దిపాటి మార్గంలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి..అది కూడా కూలిపోతే నాలుగు గ్రామాలకు ఆత్మకూరు వైపు రాకపోకలు నిలిచిపోతాయి. ఇసుక వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు కు ఈ దుస్థితి ఏర్పడిందని అనుమతులు లేని ఈ భారీ వాహనాల ప్రయాణం వల్ల ఈ రోడ్డుకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. బ్రిడ్జికి మరమ్మతులు చేసి సరిచేయాలని సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Scroll to Top