PS Telugu News
Epaper

తంగళ్ళపల్లిలో విషాదం: మచ్చ జలంధర్ ఆత్మహత్య

📅 10 Nov 2025 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, నవంబర్ 10( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన జరిగింది. స్థానికంగా మచ్చ జలంధర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, జలంధర్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా వెలుగు చూడలేదు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జలంధర్ మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Scroll to Top