PS Telugu News
Epaper

సైడ్ క్యారెక్టర్ నుండి టాప్ హీరో.. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో తారగా ఎదిగిన స్టార్

📅 06 Nov 2025 ⏱️ 1:21 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు.సినీ సెలబ్రెటీలు ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. మన హీరో హీరోయిన్స్ ను ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనకుండా ఉండలేం.. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. కాగా పైన కనిపిస్తున్న హీరోని గుర్తుపట్టారా.? అతను ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో అతను. కెరీర్ బిగినింగ్ లో ఇలా పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు. ఆతర్వాత హీరోగా మారాడు.. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో కనిపెట్టరా.? అతను ఎవరంటే..శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించాడు. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్ మూవీ. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కదలకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సునీల్ కామెడీ టైమింగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో అమెరికా పెళ్లికొడుకుగా కనిపించిన హీరో ఎవరో తెలుసా.? అతను మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్.అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్, సినిమాలతో హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక ఇప్పుడు గూఢచారి 2, డెకాయిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.


Scroll to Top