నిబద్దతతో పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొనిరావాలి.
పయనించే సూర్యుడు నవంబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
హోంగార్డు కు నియామకపత్రాలను అందించిన,జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ యూనిట్ ఖజాపీర్ మరియు నంద్యాల యూనిట్ లలో జాఫర్ వలి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నుండి వారికి రావసిన బెన్ఫిట్స్ అందించడం జరిగింది.
అనంతరం నేడు ఖజాపీర్ భార్య జహీర్ బీ కి మరియు జాఫర్ వలి భార్య తయాబా బేగమ్ కి హోంగార్డ్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా నేడు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS చేతుల మీదుగా నంద్యాల జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయం నందు హోంగార్డ్ గా నియమించిన దృవపత్రాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహించకుండా నిబద్దతతో పనిచేయాలని, పోలీస్ శాఖకు మీ యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని, మీకు ఏ సహాయం కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి , ఆర్మూడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.
