విద్యార్థిని మృతితో కలకలం – స్కూల్ హాస్టల్ రూమ్‌లో దాగి ఉన్న రహస్యమేమిటి?
పయనించే సూర్యుడు న్యూస్ :విద్యార్థిని అనుమానాస్పద మృతి కడపలో ఉద్రిక్తతకు దారి తీసింది. పులివెందులకు చెందిన జస్వంతి. కడప శివారులోని చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ K7 లో 9వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం స్కూల్‌లో SA-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జస్వంతి ఉదయం కళ్లు తిరిగి పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. ఆస్పత్రికి తీసుకువెళ్తున్నామని అక్కడకు రావాలని చెప్పారు. అయితే తాము ఆస్పత్రికి వచ్చిన తర్వాత..తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు..జస్వంతి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తమకు న్యాయం జరిగే వరకూ పోస్ట్‌మార్టంకు ఒప్పుకోబోమని మృతదేహంతో ఆందోళనకు దిగారు. తమ బిడ్డ చావుకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్ధిని మృతికి యాజమాన్యం కారణమని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు విద్యాశాఖ అధికారులు.. సోమవారం ఉదయం స్టడీ అవర్‌లో బాలిక తన హాస్టల్ రూమ్‌కు వెళ్లి గడియ పెట్టుకుందని.. చాలా సేపు తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థిని చూడగా.. అప్పటికే రూములో ఫ్యాన్‌కు ఊరేసుకుని వేలాడుతూ కనిపించిందని యాజమాన్యం తెలిపింది.మరోవైపు విద్యార్థిని మృతిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీసులు. బాధితులను కఠినంగా శిక్షిస్తామన్న పోలీసుల హామీతో ఎట్టకేలకు పోస్ట్‌మార్టంకు ఒప్పుకున్నారు జస్వంతి కుటుంబ సభ్యులు..