తెలంగాణ

హైదర్‌నగర్‌లో యువతి అదృశ్యం

హైదర్‌నగర్‌లో యువతి అదృశ్యం

ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు.. జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్న యువతి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదర్‌నగర్‌లో ఓ యువతి అదృశ్యమైన ఘటనపై కెపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పొలంకి మండలం పల్లిపేట గ్రామానికి చెందిన బి. జాజువా కుమార్తె బినియా ఝాన్సీ (28) ప్రస్తుతం తన చెల్లెలు బినియా దివ్య (27), తమ్ముడితో కలిసి హైదర్‌నగర్‌ మిత్రా హిల్స్‌లోని సాయి కృపా నివాస సముదాయంలోని 103వ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. బినియా ఝాన్సీ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సుమారు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు గత విషయాలను రెండు రోజుల వరకు గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యతో ఆమె ప్రస్తుతం మందులు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26న ఉదయం సుమారు 6 గంటల సమయంలో బినియా దివ్య, ఆమె తమ్ముడు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఝాన్సీ ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు వారు తిరిగి ఇంటికి చేరుకోగా తలుపు మూసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఝాన్సీ ఫోన్‌కు ఫోన్ చేయగా ఫోన్ మోగినప్పటికీ ఆమె ఫోన్ ఇంట్లోనే కనిపించింది.దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని, పరిచయస్తులను విచారించగా ఝాన్సీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అనంతరం అపార్ట్‌మెంట్‌ లోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో ఉదయం సుమారు 7.50 గంటలకు ఝాన్సీ ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆమె చేతిలో ఎలాంటి వస్తువులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.ఆమె స్నేహితులు, బంధువులను కూడా సంప్రదించి ఆచూకీ కోసం ప్రయత్నించగా,వారి వద్దకు ఝాన్సీ రాలేదని, వారికి ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయలేదని తెలిపారు. జ్ఞాపకశక్తి సమస్య ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అదృశ్యమైన యువతి వివరాలు:పేరు: బినియా ఝాన్సీ వయస్సు: 28 సంవత్సరాలు ఎత్తు: సుమారు 5 అడుగుల 5 అంగుళాలు ఛాయ: తెలుపు ధరించిన దుస్తులు: నలుపు రంగు పై దుస్తులు, ఆకుపచ్చ రంగు ప్యాంటు తెలిసిన భాషలు: తెలుగు, ఆంగ్లం గుర్తింపు గుర్తు: గతంలో జరిగిన ప్రమాదం కారణంగా కుడి చేతిపై కుట్లు వేసిన గుర్తులు ఉన్నాయి. ఈ మేరకు బినియా దివ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూకట్‌పల్లి పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన యువతి ఆచూకీ తెలిసిన వారు కూకట్‌పల్లి పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.దర్యాప్తు అధికారి: వి. సంగయ్య, హెడ్ కానిస్టేబుల్ ఫోన్: 8712567912

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS