తెలంగాణ

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య…

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య…

రుద్రూర్, సెప్టెంబర్ 26 (పయనించే సూర్యుడు న్యూస్): మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్బర్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కట్టు రాహుల్ (28) అను వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం బెడ్ రూమ్ లో గల ఫ్యాన్ కి చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంచనామ నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS