సూళ్లూరుపేట మున్సిపాలిటీ లొ ని పడమటి కండ్రిక లో కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమి కబ్జా కి గురైంది
పయనించే సూర్యుడు నవంబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట పడమటి కండ్రిగ రెవెన్యూ పరిధిలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం దగ్గర ఉన్న కాళంగి నది బిర్జి కి దక్షిణ వైపు ఉన్న సర్వే నంబర్,83/1,83/3,83/4, 83/10b. ప్రభుత్వ అనాదీనం భూమి కొందరు పెత్తందారులు ఆక్రమించుకొని లేఔట్లుగా మార్చి కోట్ల రూపాయలకి విక్రయిస్తున్నారు ఈ ఆక్రమణ పై రెవెన్యూ అధికారులు నామా మాత్రపు హెచ్చరిక బోర్డులుపెట్టి వదిలేశారు . అదే ఒక పేదవాడు ఒక చిన్న గుడిసె ప్రభుత్వ భూమి లో గాని వేసుకుంటే మొత్తం రెవెన్యూ మున్సిపాలిటీ మరియు ఇతర అధికారులు ఆ గుడిసెను కొన్ని గంటల వ్యాధిలోని తొలగిస్తారు . కనుక కబ్జా గురి అయిన భూమిని వెంటనే రెవిన్యూ మరియు మున్సిపాలిటీ అధికారులు కలసి ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
