PS Telugu News
Epaper

టి‌ఎస్‌యూ‌టిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

📅 11 Nov 2025 ⏱️ 6:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, నవంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్

టి‌ఎస్‌యూ‌టిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఎన్నికలు జెడ్పిహెచ్ఎస్‌ తంగళ్లపల్లి పాఠశాల ఆవరణలో మండల మహాసభలో ఘనంగా నిర్వహించారు. కమిటీ పదవులన్నీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. మండల అధ్యక్షుడిగా కొక్కుల బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా క్యారం సుధీర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరై మాట్లాడుతూ — సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలని, 317 బాధిత ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల పరిశీలకులుగా జిల్లా కోశాధికారి అంబటి రమేశ్ వ్యవహరించారు.అధ్యక్షులు కొక్కుల బాలరాజు (ఎంపీపీ ఎస్ బస్వాపూర్),ప్రధాన కార్యదర్శి క్యారం సుధీర్ కుమార్ (ఎంపీపీ ఎస్ దేశాయిపల్లి),ఉపాధ్యక్షుడు చింతకింది నాగరాజు,ఉపాధ్యక్షురాలు పసుల సరిత
కోశాధికారి: చామంతుల ఆంజనేయులు,కార్యదర్శులు పోకల కిరణ్, కోడం ప్రశాంతి,అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ— ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించారు.

Scroll to Top